తీగపూర్‌లో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నేతపై దాడి
RR: పంచాయతీ ఎన్నికల వేళ తీగపూర్‌లో ఉద్రిక్తత చెలరేగింది. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మేండే కృష్ణ యాదవ్‌పై అదే పార్టీకి చెందిన 20-30 మంది దాడి చేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాడని జోల్లు బాలయ్య తదితరులు దాడికి పాల్పడినట్లు కృష్ణ యాదవ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వైరల్ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.