'వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి'
ASF: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ అన్నారు. సోన్ మండలం కడ్తాల్, సాకెర గ్రామాలలో బుధవారం ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఆయన, కూలీలకు రూ. 800 చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.