'సభ్యత్వ నమోదు విస్తృత స్థాయిలో జరుగుతోంది'
కృష్ణా: సభ్యత్వ నమోదు విస్తృత స్థాయిలో జరుగుతోందని జనసేన పార్టీ మండల నాయకులు అనుమకొండ పూర్ణచంద్రరావు తెలిపారు. మంగళవారం చల్లపల్లిలోని లయన్స్ కాంప్లెక్స్ ఎదుట సభ్యత్వ నమోదు శిబిరం వద్ధ పలువురు జనసేన పార్టీలో చేరారు. ఒకటో వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 14 మంది పూర్ణచంద్రరావు సమక్షంలో సభ్యత్వములు పొందారు.