కోతుల బెడదను వెంటనే నివారించాలి: గ్రామస్తులు
MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో కోతుల బెడదతో ప్రజలు తీవ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇవాళ స్థానిక ప్రజలు కోతుల బెడదను నివారించాలంటూ.. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే కోతుల బెడదను నివారించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు.