'సినర్జీస్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి'

VSP: గాజువాక సమీపంలోని దువ్వాడలోని సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం YSR కాంగ్రెస్ పార్టీ సహాయం కోరారు. సకాలంలో వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదని ఆరోపించారు. కంపెనీ ఉద్యోగుల సంఘం నాయకులు బుధవారం విశాఖ YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.కె.రాజును కలిసి విన్నవించుకున్నారు.