‘రోడ్డు, రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’
NDL: వాహనదారులు రోడ్డు, రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నంద్యాల రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ తిమ్మరుసు నాయుడు సూచించారు. నిన్న కోవెలకుంట్ల శివారులోని కుందూ బ్రిడ్జ్ వద్ద నిబంధనలు ఉల్లంఘించిన 11 వాహనాలను తనిఖీ చేసి రూ. 7,600 జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.