త్యాగరాజు ఎన్ని కీర్తనలు రచించారంటే?

త్యాగరాజు ఎన్ని కీర్తనలు రచించారంటే?

సంగీత త్రిమూర్తులలో ఒకరైన వాగ్గేయకారుడు త్యాగరాజు జయంతి నేడు. త్యాగరాజు నాదోపాసన ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవచ్చని నమ్మారు. తమిళనాడులో జన్మించినప్పటికీ, ఆయన తెలుగు భాషలో అనేక కీర్తనలు రచించారు. త్యాగరాజు దాదాపు 24 వేల కీర్తనలు రచించారని చెబుతారు, కానీ ప్రస్తుతం అందుబాటులో 800 మాత్రమే ఉన్నాయి. ఆయన కర్ణాటక సంగీతంలో తెలుగు భాషకు ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.