కార్మికుల కాళ్లు కడిగి సన్మానించిన సర్పంచ్!
NRPT: తెలంగాణ ప్రభుత్వ '99 రోజుల ప్రజాపాలన' ప్రణాళికలో భాగంగా మంథన్‌గోడ్ సర్పంచ్ రాజేందర్ గౌడ్ అరుదైన గౌరవం చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. గ్రామ శుభ్రతలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, వారిని గౌరవించడం అందరి బాధ్యతని సర్పంచ్ పేర్కొన్నారు.