ఎస్సీ కాలనీ శ్మశానవాటిక రహదారికి మోక్షం

NLR: పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి ఎస్సీ కాలనీ శ్మశాన వాటిక రహదారికి ఎన్నో ఏళ్లకు మోక్షం కలిగింది. సుమారు 100 ఏళ్లుగా శ్మశాన వాటికకు రహదారి లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఈ నేపథ్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో ఆ దారికి మోక్షం కలిగింది. రూ.10 లక్షలతో సిమెంట్ రోడ్డుకు నిధులు మంజురయ్యాయి.