VIDEO: గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో ఇబ్బందులు...!
KMR: మద్నూర్ మండలంలో గ్యాస్ సిలిండరు బుకింగ్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం గ్యాస్ ఆఫీసుకు వస్తున్న బుకింగ్, ఓటిపీ రాకపోవడంతో నిరాశతో వెనుదిరగడం జరుగుతుందని వినియోగదారులు వాపోతున్నారు. కాగా బుకింగ్ అయిన వారికీ మాత్రం సిలిండరు సకాలంలో అందజేస్తున్నామని డీలర్లు పేర్కొన్నారు. పైనుంచి బుకింగ్ సమస్య ఉందని వివరించారు.