అనంతపురంలో ఎన్‌సీసీ ర్యాలీ

అనంతపురంలో ఎన్‌సీసీ ర్యాలీ

ATP: 'వందేమాతరం' జాతీయ గీతం ఆవిష్కరణకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనంతపురం క్లాక్ టవర్‌ వద్ద ఎన్‌సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, దేశభక్తిని చాటుతూ వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ ర్యాలీలో భారత జెండాలతో ప్రదర్శన చేయగా, పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.