పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
KMR: జిల్లాలోని వడ్లూర్-ఎల్లారెడ్డి,మర్కల్, సదాశివ నగర్, గోకుల్ తండా ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా, శాంతియుత వాతావరణం లో పోలింగ్ జరిగేటట్లు చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలిని ఎస్పి స్వయంగా వీల్ చైర్ తెప్పించి సహయం చేశారు.