రాష్ట్రంలో రూ.5,942 కోట్ల పెట్టుబడులు: లోకేష్
AP: ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్రంలో రూ.5,942 కోట్లు పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేష్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సౌర యూనిట్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. దీంతో సుమారు 3,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సౌరశక్తి ప్రాజెక్టుకు APIIC ద్వారా 269 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. దేశంలోనే రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ ప్రాజెక్టు ఏపీకి రానుందన్నారు.