ఉత్తమ సేవా పురస్కారం అందజేత

ఉత్తమ సేవా పురస్కారం అందజేత

MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ పంచాయతీ కార్యదర్శి లావణ్య ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి గ్రామస్తుల మన్ననలు పొందారు. దీంతో పంద్రాగస్టు సందర్భంగా శుక్రవారం మంచిర్యాలలో ఆమె ప్రభుత్వ సలహాదారులు ఏ.వేణుగోపాలరావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు.