గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులకు పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అంటు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.