రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది: విడదల
PLD: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి రజిని విమర్శించారు. నరసరావుపేటలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. 'వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఎవర్నీ వదిలిపెట్టం.. రిటర్న్ గిఫ్ట్ తప్పదు' అంటూ ఆమె హెచ్చరించారు.