'యువతను క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలి'
AKP: అధిక సంఖ్యలో యువత క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం అనకాపల్లిలో 18 ఏళ్లు పైబడిన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి క్రీడల ఎంపిక పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా 10 కిలోమీటర్ల మారథాన్ రన్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అలాగే కొత్తూరులఛ కబడ్డీ, ఆర్చరీ, గిల్లి దండా పోటీలను నిర్వహించామన్నారు.