యుద్ధం.. భగ్గుమంటున్న క్రూడాయిల్ ధరలు

యుద్ధం.. భగ్గుమంటున్న క్రూడాయిల్ ధరలు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 83.86 డాలర్ల వద్ద చేరుకుంది. ఈ ఒక్క వారంలోనే క్రూడ్ ధర ఏకంగా 12 శాతం పెరగడం గమనార్హం. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.