వేరుసెనగవిత్తన ధర ఖరారు
CTR: రబీ సాగు రైతులకు రాయితీ వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేరుసెనగ విత్తనం క్వింటా పూర్తి ధర 9,200 కాగా.. అందులో ప్రభుత్వ రాయితీ రూ.3,680(40 శాతం) పోను రైతు వాటా రూ.5,520 చెల్లించాలని నిర్ణయించింది. ఈ లెక్కన రాయితీపై 30 కిలోల బస్తా ధర రూ.1,656 కానుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు.