రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో యూరియా

రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో యూరియా

GNTR: రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందని తుళ్లూరు మండల వ్యవసాయ అధికారిణి సంధ్యారాణి తెలిపారు. గురువారం పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో రైతులకు ఈ విషయాన్ని వివరించారు. ప్రైవేట్ డీలర్లు, రైతు సేవా కేంద్రాలు, గ్రామసభల ద్వారా యూరియా అవసరాలను తెలుసుకొని, రాబోయే 15 రోజుల్లో సరిపడా యూరియా ఉంటుందన్నారు.