గుడివాడ ఆర్డీవోకి ఎమ్మార్పీఎస్ వినతి

కృష్ణా: గుడివాడలో మాదిగలకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 2024 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏబీసీ వర్గీకరణ చేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చిందని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.