వీరభద్రియ సంఘ భవనము నిర్మాణ పనుల ప్రారంభం

SRD: పటాన్చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ జెపి కాలనీలో వీరభద్రియ సంఘ భవనము నిర్మాణ పనులను బుధవారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేటర్‌ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు పట్టణ బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్, ,సిహెచ్ యాదయ్య తదితరులు ఉన్నారు.