కూరపర్తి కోటలో 41 రోజుల ప్రత్యేక పూజలు ప్రారంభం
అన్నమయ్య: వాల్మీకిపురం మండలంలోని కూరపర్తిలో గ్రామస్థులు ఇటీవల కోటను పునర్నిర్మించి ఆలయ ప్రతిష్ఠలను నిర్వహించారు. ఆదివారం గణపతి, వేంకటేశ్వర స్వాములకు పంచామృతాభిషేకాలు చేశారు. నేటి నుంచి వరుసగా 41 రోజుల పాటు ప్రతిరోజూ ప్రత్యేక అభిషేకాలు, సాయంత్రం భజనలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.