ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి ఫుడ్ పాయిజన్

GNTR: బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మంగళవారం రాత్రి అస్వస్థకు గురయ్యారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెనికి చెందిన లక్ష్మయ్య పొలం రోడ్డు పక్కన ఉన్న పుట్టగొడుగులను ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులంతా కూరచేసుకుని తిన్నారు. ఈ కూర తిన్న ఐదుగురికి వాంతులు కడుపునొప్పి రావడంతో సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.