మధ్యాహ్న భోజనాన్ని విరమించుకున్న విద్యార్థులు

VZM: ఎస్. కోటలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో భోజన నాణ్యత తగ్గినట్లు, విద్యార్థుల ఆరోగ్యాన్ని హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. భోజనంలో అన్నం, కూరలు సరిపోకపోవడం, నాణ్యత లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పలుమార్లు చెప్పినప్పటికీ, వార్డెన్ స్పందించకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం విరమించారు.