మెదక్: పండగకు సిద్ధమవుతున్న మహాదేవాలయం
MDK: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆలయం పరిసరాలు శుభ్రం చేస్తూ, రంగులు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఈ మహాదేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు.