సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి: ఎస్పీ
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోని చెక్‌పోస్ట్‌ను సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.