పర్యాటక రంగం వాటా 10% పెంచడమే లక్ష్యం: జూపల్లి
TG: రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీ అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పర్యటక రంగాన్ని బలోపేతం చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. హాస్పిటాలిటీ, హస్తకళలు, రవాణా రంగాల్లోని వేలాది MSMEలకు ఇది జీవనాధారంగా మారనుంది. 2047 నాటికి పర్యాటక రంగం వాటాను 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి జూపల్లి చెప్పారు.