BSNL సేవలు మరింత విస్తరించాలి: ఎంపీ

NLG: ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతూ.. నూతన ఒరవడిని అందిపుచ్చుకుంటూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సేవలు మరింత విస్తరించాలని రాజ్యసభ MP వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నల్గొండ పానగల్ రోడ్డులో ఉన్న BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం జరిగిన టెలికాం సలహా సంఘం సమావేశానికి ఆయన హాజరై సంస్థ పురోభివృద్ధికి పలు సూచనలు చేశారు.