సమ్మెకు పార్టీలు, కార్మిక సంఘాల మద్దతు

సమ్మెకు పార్టీలు, కార్మిక సంఘాల మద్దతు

NRPT: నారాయణపేటలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీజేపీ, టీయూసీఐ, సీపీఐ ఎంఎల్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. బీజేపీ నాయకుడు నాగురావు, టీయూసీఐ ఉపాధ్యక్షుడు కాశీనాథ్ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.