అశ్వ వాహనోత్సవంపై స్వయంభు జంబుకేశ్వరుడు
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు అశ్వ వాహనోత్సవంపై భక్తులకు శుక్రవారం అభయమిచ్చాడు. స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా సాయంకాలం పురోహితులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తిని అశ్వవాహన ఉత్సవం పై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు.