'మందులను వాడి క్షయ వ్యాధిని నివారించవచ్చు'
ADB: క్రమం తప్పకుండా మందులను వాడి క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 100 రోజుల 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.