నగరంలో ఫ్లాట్ల విక్రయం పేరుతో మోసం
HYD: ఫ్లాట్ల విక్రయం పేరుతో మోసం చేసిన కొందరిపై సైబరాబాద్ EOW పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులు రూ.15.26 కోట్ల మేర మోసం చేశారని, ఇందులో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నడమర్తి శివప్రసాద్, నవీన్ కుమార్ గోయల్, నరేంద్ర కుమార్ మోదీ, శశికాంత్ మోదీ పేర్లను FIRలో చేర్చినట్లు వెల్లడించారు.