కాంగ్రెస్ గూటికి చేరిన BRS కార్పొరేటర్

HYD: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన BRS కార్పొరేటర్ చీరాల నర్సింహ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.