ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

AP: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. దీంతో పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరింది. అలాగే పుష్కర ఘాట్ మెట్లను వరద ప్రవాహం దాటింది. అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.