రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే
NLR: వనమహోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1.25 లక్షల మొక్కలు నాటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం సర్వేపల్లి రిజర్వాయర్లో చేప పిల్లలు వదిలారు. మత్స్యసంపదను వృద్ధి చేసేందుకు 11 లక్షల చేపపిల్లలను వదిలామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తానన్నారు.