వినుకొండలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం
PLD: వినుకొండలో బుధవారం ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎమ్మెల్యే ఆంజనేయులు దంపతులు పాల్గొని విద్యా సమస్యలపై చర్చించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా టెన్త్ టాపర్లకు బహుమతులు ఇస్తున్నామని, ఉత్తమ ఫలితాలిచ్చే టీచర్లను కూడా సత్కరిస్తామని జీవీ తెలిపారు. నియోజకవర్గాన్ని 'విద్యా హబ్'గా మారుస్తామని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.