చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్

చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్

TG: తిరుమలలోని హథీరాం బావాజీ మఠం కూల్చివేతకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ నిర్ణయం హాథీరాం బావాజీని ఆరాధించే బంజారాల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబును ఆమె 'X' వేదికగా కోరారు.