ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

NRML: కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల గురుకుల బాలికల పాటశాలలో టీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలో మొత్తం 528 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 512 హాజరైనట్లు, 16 మంది గైర్హాజరైనట్లు కళశాల ప్రిన్సిపాల్, ఎక్సమ్ ఇంఛార్జ్ శకుంతల తెలిపారు. డీవో కవిత పర్యవేక్షణలో పరీక్షను పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.