జిల్లాలో పెద్దపులి సంచారం

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల శివారు బుగ్గగూడెం దారిలో పులి సంచరిస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ పూర్ణచందర్ తెలిపారు. శుక్రవారం ఆ ప్రదేశంలో పెద్దపులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. బుగ్గ దేవాలయం వెళ్ళు దారిలో వెళ్లేవారు సాయంత్రం అలాగే ఉదయం జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఎవరికైనా పెద్దపులి ఆనవాళ్లు కనిపించిన అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.