నేడు నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్
W.G. నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చన్నారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.