ధవళేశ్వరంలో బాలుడు అదృశ్యం...!

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలోని ఎర్రకొండ ప్రాంతానికి చెందిన తేటకాల వరుణ్(11) అదృశ్యంపై ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్థానిక హర్షవర్ధన స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న బాలుడు సోమవారం ఉదయం 6:45 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బాలుడు ఆచూకీ లభించకపోవడంతో తండ్రి రాము ధవలేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.