VIDEO: పేరుపాలెం బీచ్‌‌లో సందడి చేసిన యాత్రికులు

VIDEO: పేరుపాలెం బీచ్‌‌లో సందడి చేసిన యాత్రికులు

W.G: పేరుపాలెం బీచ్ కుటుంబ సభ్యులు, యువత, చిన్నారులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం ఉదయం నుంచి సందర్శకులు సముద్ర గాలులు, అలల అందాలు, ఇసుక తీరంలో ఆటలతో ఆనందించారు. బీచ్ సమీపంలోని ఆలయాలను కూడా భక్తులు సందర్శించారు. పిల్లలు గుర్రపు స్వారీ, ఆటబొమ్మలతో సందడి చేయగా, పెద్దలు ఆహ్లాదంగా విహరించారు. పోలీసులు, లైఫ్‌గార్డులు భద్రతా పర్యవేక్షణ చేపట్టారు.