పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వవద్దు: సూపర్వైజర్
NLR: అల్లూరు మండలం పురిణి హరిజనవాడ అంగన్వాడీ కేంద్రం నందు బుధవారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ... పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వవద్దని సూచించారు. పిల్లలను మొబైల్ నుంచి తప్పించి ఆటల వైపు దృష్టి మళ్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.