మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తీగల సునీత

మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తీగల సునీత

WGL: వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామానికి చెందిన తీగల సునీతను వర్ధన్నపేట మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించారు. నియామక కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కరుణాటి పార్వతమ్మ పాల్గొని ఆదివారం ఆమెకు నియామక పత్రం అందజేశారు. నాయకులు తీగల సునీతకు శుభాకాంక్షలు తెలియజెప్పి, పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలన్నారు.