బైక్ బోల్తా.. వ్యక్తి మృతి

TPT: బైకు అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన రామచంద్రాపురం మండలంలో చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలం పచ్చికాపలం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం ఆచారి పచ్చికాపలం నుంచి తిరుపతికి బైకుపై వస్తూ రామచంద్రాపురం (M), గంగిరెడ్డిపల్లి మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. వాహనదారులు గుర్తించి 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.