నక్కలగుట్టలో విద్యుత్ ధరలపై బహిరంగ విచారణ
HNK: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) టీజీఎన్పీడీసీఎల్ ప్రతిపాదించిన విద్యుత్ ధరలు, ఆదాయ అవసరాలపై ఈ నెల 6న బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వినియోగదారులు, ఆసక్తి గల వ్యక్తులు హాజరై తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలపాలని ఆయన కోరారు.