జిల్లా ఎస్పీకి అరుదైన గౌరవం..!
VZM: ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. దీనిలో భాగంగా 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట సేవా పతకానికి ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఎంపిక అయ్యారు. దీని పట్ల అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.