రాహుల్ గాంధీపై కవిత కీలక వ్యాఖ్యలు

WGL: వరంగల్‌కు వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేశారని విమర్శించారు. వరంగల్ డిక్లరేషన్‌పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ భయపడ్డారన్నారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరు అని అన్నారు.