నేడు పీయూలో శ్రీ భాగ్యరెడ్డి వర్మ జయంతి

MBNR: పాలమూరు యూనివర్సిటీలో శ్రీ భాగ్య రెడ్డి వర్మ 137వ జయంతి వేడుకలు గురువారం ఉదయం 11:30 గంటలకు యూనివర్సిటీలోని పరిపాలన భవన్‌లో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమేష్ బాబు సర్కులర్ జారీ చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి (VC) ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ హాజరు కానున్నారు. ఆయా శాఖల అధ్యాపకులు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొనాలని కోరారు.